- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టమాటా రైతులకు సర్కారు గుడ్న్యూస్

దిశ డైనమిక్ బ్యూరో: మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి టమాటా రైతులను ఆదుకుంటామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రోజు ఆయన టమాటాకు గిట్టుబాటు ధరపై మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. టమాటా రైతులు ఆదుకునే చర్యలు ఉండాలని మంత్రి అచ్చన్న సూచించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లాలో కిలో టమోటా రూ.8కి కొని రైతు బజార్లకు పంపాలి అన్నారు. ఈరోజు 1000 క్వింటాళ్ల టమాటాలు స్వీకరించి పట్టణాలు నగరాలకు పంపామన్నారు. ఎంఐఎస్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్ ద్వారా రైతులను ఆదుకోవాలన్నారు. టమాటాలను తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు పంపిస్తామన్నారు. రాష్ట్రాలకు పంపడం వల్ల 15 రూపాయల వరకు ధర వస్తుందన్నారు. టమాటాలను ప్రాసెసింగ్ యూనిట్లకు పంపుతామని ఆయన తెలిపారు. టమాటా రైతులకు గిట్టుబాటు ధరకు వచ్చేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు మనకి తెలిపారు.