- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. మరో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ మరో పథకం అమలు చేస్తున్నట్లు టీడీపీ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. వివరాల్లోకి వెళితే..ప్రైవేట్ దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు రూ.10 వేలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని టీడీపీ తెలిపింది. ఈ క్రమంలో చంద్రబాబు మరో హామీ అమలు చేశారని పేర్కొంది. ‘నిధులు లేక కనీసం ధూప, దీప, నైవేద్యాలకు కూడా నోచుకోని సుమారు 6,000 దేవాలయాలకు గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఐదు వేలు చొప్పున ఇచ్చారు. తిరిగి చంద్రబాబు గారు తాను మాటిచ్చిన ప్రకారం రూ.10,000 చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే హామీ నెరవేర్చినందుకు భక్తులు, అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తున్నాయి’ అని టీడీపీ పార్టీ ఎక్స్ వేదికగా పేర్కొంది.