Good News For rural youth: గ్రామీణ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. త్వరలో

by Kavitha |
Good News For rural youth: గ్రామీణ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. త్వరలో
X

దిశ, వెబ్‌డెస్క్: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. యువతను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలని, అందుకు తగ్గట్టుగా స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. యూత్‌ సర్వీసెస్‌, క్రీడల శాఖపై అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల్లో ఆట స్థలాలు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2027 లో వచ్చే జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలన్నారు. కాగా అంతకుముందు నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్‌ఎంఇ డిపార్ట్‌మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed