- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health: పగటి పూట నిద్ర మంచిది కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
దిశ , వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో కొందరు మెషిన్ లాగా పని చేస్తూనే ఉంటున్నారు .. పగలు, రాత్రి అని తేడా లేకుండా.. 24 గంటలు ఎదోక పనిలో బిజీ అవుతున్నారు. ప్రకృతి వలనే మనకి రాత్రి, పగలు అనేది తెలుస్తుంది. కానీ, ఇప్పుడు బిజీ బిజీ లైఫ్ తో గడిపేస్తున్న ఎంతో మంది దీనికి విరుద్ధంగా ఉంటున్నారు. ఇప్పుడు రాత్రంతా పని చేసి పగలు మొత్తం పడుకుంటున్నారు. మరి, ఇది ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు పరిశోధనలు చేసి షాకింగ్ నిజాలు వెల్లడించారు.
పగలు నిద్రించే 7 గంటలకు, రాత్రి నిద్రించే 7 గంటలకు చాలా తేడా ఉందని నిపుణులు తెలిపారు. పగటి పూట చిన్న న్యాప్ తీసుకోవచ్చు. తప్పని సరి పరిస్థితుల్లో రాత్రి మేల్కొని ఉండాలనుకుంటే .. త్వరగా నిద్ర పోయి రాత్రి మేల్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొంత మంది నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు. కానీ రాత్రంతా అలాగే మేల్కొని ఉండటం వలన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీరిలో మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తాయని అంటున్నారు. ఒక వ్యక్తి తప్పనిసరి 7-8 గంటల పాటు నిద్రపోవాలి. కాబట్టి , పగటి పూట నిద్ర కంటే రాత్రి పూట మంచిదిని నిపుణులు తేల్చి చెప్పారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
- Tags
- health tips
- Sleep