ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

by Jakkula Mamatha |   ( Updated:2024-07-08 10:29:31.0  )
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై దృష్టి పెట్టారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఇదివరకే చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో పథకాన్ని అమలు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకం కింద కూటమి ఎన్నికల సమయంలో ఆరు హామీలు ఇచ్చింది. అందులో ఈ పథకం కూడా ఉంది. ఈ పథకం కింద 18 ఏళ్ల వయసు దాటి ఉండాలని.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ పథకం ద్వారా డబ్బులు ప్రతి నెలా అకౌంట్‌లో జమ చేస్తారు. ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. త్వరలోనే విధివిధానాలను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story