Global University: ఏపీలో గ్లోబల్ యూనివర్సిటీ.. అధికారులకు మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

by Shiva |
Global University: ఏపీలో గ్లోబల్ యూనివర్సిటీ.. అధికారులకు మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయాలు తీసుకంటూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్ చేసేందుకు సర్కార్ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో గ్లోబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు మంత్రి నారా లోకేశ్ గురువారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్సిటీకి ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఎక్కడైతే బాగుంటుంది, కావాల్సి మౌలిక సదుపాయాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏఐ టెక్నాలజీ వర్సిటీతో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ లాంటి మొత్తం 16 రంగాల్లో సేవలను విస్తృతం చేయవచ్చని లోకేశ్ అన్నారు. అదేవిధంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీతో విద్యార్థుల కంప్లీట్ స్టూడెంట్ పాస్‌పోర్టు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇం‌చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed