విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడం లేదు: గంటా

by srinivas |   ( Updated:2024-02-16 16:49:25.0  )
విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడం లేదు: గంటా
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తాను విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయట్లేదని, 2019లో అక్కడ నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. త్వరలోనే పార్టీ హై కమాండ్ కొత్త ఇన్‌చార్జిని నియమిస్తుందని ఆయన శుక్రవారం విశాఖలో విలేకరుల సమావేశంలో చెప్పారు. పార్టీ సమీకరణాల దృష్ట్యా ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గతంలో చోడవరం, అనకాపల్లి, భీమిలి నయోజక వర్గాల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని గుర్తు చేశారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమా వాస్తవ పరిస్థితికి సజీవ సాక్ష్యమని గంటా శ్రీనివాసరావు స్పస్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed