వ్యాయామ సామాగ్రితో వినాయక ప్రతిమ..వినూత్న పద్ధతిలో పూజలు

by Jakkula Mamatha |
వ్యాయామ సామాగ్రితో వినాయక ప్రతిమ..వినూత్న పద్ధతిలో పూజలు
X

దిశ, గాజువాక:తనలోని భక్తి భావానికి సృజనాత్మకతను జోడించి సకల దేవతా స్వరూపుడిగా పూజలందుకునే గణపతి స్వరూపాన్ని వినూత్నంగా తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక అగనంపూడి లోని ఆర్కే షేప్ ఫిట్నెస్ జిమ్ నిర్వాహకుడు బర్ల రవి కుమార్ యాదవ్. భూత భవిష్యత్ వర్తమానాలకు అందనివాడిగా భావించే విఘ్నేశ్వరుని స్వరూపాన్ని వివేచనతో వారికి అందుబాటులో ఉన్న వ్యాయామ సామాగ్రితో ఏర్పాటు చేసి వినాయకుడిని వ్యాయామశాల కు వలస వచ్చారా అన్నట్లుగా అత్యద్భుతంగా రూపొందించిన వెరైటీ వినాయకుడు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నారు.

శనివారం వినాయక చవితి సందర్భంగా వ్యాయామంలో నిత్యం వినియోగించే డంబుల్స్ ఇతరత్రా సామాగ్రితో వినాయక ప్రతిమను రూపొందించి దానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకుడు బర్ల రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ భక్తి శ్రద్దలతో నిర్వహించుకునే లంబోదరుడి పూజలు సాధారణం కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనతో జిమ్ సామాగ్రితోనే వినాయక స్వరూపాన్ని ఏర్పాటు చేశామని, పర్యావరణహితంగా విఘ్నేశ్వర పూజను నిర్వహించటంతో పాటుగా మనిషి మనుగడకు ఉపయోగపడే ప్రతి వస్తువును పూజించాలనే సనాతన భారతీయ సంస్కృతి ఆధారంగా తమ ఆరోగ్య పరిరక్షణకు నిత్యం ఉపయోగించే వ్యాయామ సామగ్రిని కూడా పూజించే విధంగా ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే షేప్ ఫిట్నెస్ జిమ్ సభ్యులు సాయి, శ్రీకాంత్,సత్య, నితిన్, హేమాంకిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed