CM Chandrababu:రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటినుంచంటే?

by Jakkula Mamatha |
CM Chandrababu:రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎప్పటినుంచంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది(State Development) దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు(RTC Bus)ల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఉగాది నుంచి అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎం చంద్రబాబు కోరారు. అయితే సంక్రాంతి నుంచే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని అనుకున్నాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కానీ జీరో టికెట్ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందని.. 15 రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్టమని తెలిపారు. ఈ క్రమంలో ఉగాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.

Next Story

Most Viewed