Tirumala: శ్రీవారి ఆలయంలో ఫ్రాంక్ వీడియో... టీటీడీ సీరియస్

by srinivas |
Tirumala: శ్రీవారి ఆలయంలో ఫ్రాంక్ వీడియో... టీటీడీ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: కొందరు ఆకతాయిలులో ఫ్రాంక్ వీడియోల పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరుతోంది. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. కొండలు, గుట్టు పోయి ఇప్పుడు పవిత్రమైన ఆలయాల్లో కూడా ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు ప్రాంక్ వీడియో చేయడం కలకలం రేగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు నారాయణగిరి షెడ్‌లో వేచి ఉన్నారు. అయితే కాంపార్టుమెంట్ తాళాలు తీస్తున్నట్లు కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో చేశారు. అంతేకాదు చొక్కాలు విప్పి మరీ అరుస్తూ వీడియోలు చిత్రీకరించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో టీటీడీ సీరియస్ అయింది. తమిళనాడుకు చెందిన వాసన్ అనే వ్యక్తి మిత్రులతో కలిసి ఫ్రాంక్ వీడియోలు చేసినట్లు గుర్తించింది. విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.

Advertisement

Next Story