- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తున్నారు.. మాధవీలతపై పేర్నినాని ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) తిరుమల శ్రీవారి దర్శనాని(Tirumala Srivari Darshan)కి వెళ్లాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ బీజేపీ మహిళ నాయకురాలు మాధవీలత(Telangana BJP woman leader Madhavilatha)పై మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perni Nani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్ర నుంచి భజన చేసుకుంటూ రైల్లో తిరుపతికి వస్తున్నారని, అది దిక్కుమాలిన తనమని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఆమె ఆస్పత్రిలో రోగుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు. మాధవీలత తన ఆస్పత్రిలో భజన చేయాలని సూచించారు. తమ ఆస్పత్రిలో ఒక్క పేషెంట్ కన్నా ఫీజు తగ్గించారా అని ప్రశ్నించారు. తమ ఆస్పత్రి బాగోతాలు ఎవరికీ తెలియవా అని పేర్ని నాని నిలదీశారు. కరోనా సమయంలో రోగుల నుంచి కోట్లు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. ఓవైసీ ఆస్పత్రిలో హిందువులకు ఫీజు తగ్గించారా అని అడుగుతున్న మాధవీలత తన ఆస్పత్రిలో నయా పైసా అయినా తగ్గించారా అని పేర్ని నాని ప్రశ్నించారు.
‘‘ప్రధాని మోడీ(Pm Modi)తో కలిసి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer) తిరుపతికి వెళ్లారని, డిక్లరేషన్ ఇవ్వమని ఆమె ఎందుకు అడగలేదు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్న ఎంపీల నోరు ఆ రోజు ఏమైంది. మీ వెంట అన్యమతస్థుడిని తీసుకెళ్తున్నారని ప్రధాని మోడీని ప్రశ్నించారా. ఆ రోజు నోరు పడిపోయిందా?. మాధవీలతది ఈ రాష్ట్రం కాదు. పరాయి రాష్ట్రంలో బతుకుతున్నారు. ఇక్కడి హిందువులు, మతంపై ఆమె మాట్లాడతారా?.’’ అని పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.