కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి

by Seetharam |   ( Updated:2023-09-27 11:28:14.0  )
కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె. పళని స్వామి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం పళని స్వామికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు,ఆలయ కార్యనిర్వాహణాధికారిణి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దగ్గరుండి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం పళనిస్వామికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి భ్రమరాంబలు అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.

Read More Latest updates of Andhra Pradesh News

Advertisement

Next Story