- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు ప్రతిపక్ష హోదా..... మాజీ స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రతి హోదా ఇవ్వాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించి స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవాలని ఆ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగలేదు కాబట్టే జగన్ కోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉందా లేదా అన్నదే కీలకమని చెప్పారు. రెండే పార్టీలున్నప్పుడు ఆటోమేటిక్‌గా రెండో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందన్నారు. జగన్ కు ప్రతిపక్ష హోదా విషయాన్ని న్యాయ స్థానమే చూసుకుంటుందన్నారు. ‘‘టీడీపీ కూటమికి ప్రజలు చక్కటి అధికారం ఇచ్చారు. మంచి పాలన చేయమన్నారు. మేమొక తరహా పాలన అందించాం. ఇంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వండి. వెనుకకు చూడనంత భారీ మెజార్టీతో గెలిచారు. ఎంతో విజయవంతంగా పథకాలు అమలు చేయొచ్చు. అబద్ధపు శ్వేత పత్రాలు విడుదల చేశారు. పోలవరం బాధ్యత కేంద్రానిదే. రాష్ట్రం ఎందుకు తీసుకోవాలి. రాష్ట్రంలో దారుణాలు పెరిగాయి. మద్యం విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. తాగుబోతుల కంటే చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేదంటే ప్రతిపక్షంగా నిలదీస్తాం.’’ అని తమ్మినేని సీతారాం హెచ్చరించారు.