- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో చేరికపై ఉండవల్లి అరుణ్ కుమార్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అనుకున్న రీతిలో ఫలితాలు సాధించి సక్సెస్ అయిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై కన్నేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తమ ఏంటో చూపించాలని కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం షర్మిల పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల షర్మిల భర్త బ్రదర్ అనిల్.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు. తమ కుమారుడి పెళ్లికి రావాలని ఉండవల్లిని బ్రదర్ అనిల్ ఆహ్వానించారు. అనంతరం ఇరువురి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉండవల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాయని.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ పార్టీతో పోలిక లేకుండా.. కాంగ్రెస్‌లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు.. అదే ఆ పార్టీ బలం అని వ్యాఖ్యానించారు.