Grandhi Srinivas : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు ఐటీ సోదాలు

by Y. Venkata Narasimha Reddy |
Grandhi Srinivas : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు ఐటీ సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్(Grandhi Srinivas) నివాసాల్లో మూడో రోజు ఐటీ సోదాలు(IT Searches) కొనసాగాయి. భీమవరంలో మూడో రోజు చెన్నై ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ అనుచరుల ఇళ్ళలో కూడా అధికారుల సోదాలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్‌ నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. భీమవరంలో ఏడు చోట్ల గ్రంధి శ్రీనివాస్ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వాహించారు.

పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేశారు. కేంద్ర పోలీసు బలగాల భద్రత నడుమ ఐటీ అధికారులు భీమవరంలోని గ్రంధి ఇంటికి చేరుకుని ఆయన రొయ్యల ప్రాసెసింగ్‌, ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ ల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రంధి శ్రీనివాస్ పై జిల్లా కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు. పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమిని అధిక ధరలకు కొనుగోలు చేశారని, అవకతవకలకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలోనే ఐటీ దాడులు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. గ్రంధి నివాసంలో ఐటీ సోదాలు జరగడం ఇది రెండోసారి. మూడు దశాబ్దాల క్రితం ఒకసారి తనిఖీలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేపట్టారు.

Advertisement

Next Story