మంత్రి ప్రోద్భలంతోనే నా కుమారుడిపై హత్య కేసు: మాజీ మంత్రి విశ్వరూప్

by srinivas |
మంత్రి ప్రోద్భలంతోనే నా కుమారుడిపై హత్య కేసు: మాజీ మంత్రి విశ్వరూప్
X

దిశ, వెబ్ డెస్క్: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన కుమారుడి అరెస్ట్‌పై విశ్వరూప్ స్పందించారు. మంత్రి సుభాష్ ప్రోద్భలంతోనే తన కుమారుడిపై హత్య కేసు పెట్టారని వ్యాఖ్యానించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తన కుటుంబంపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. తన ఇల్లు తగలబెట్టిన కేసులో మంత్రి సుభాష్ ఏ1గా ఉన్నారని, అందుకే తన కుటుంబంపై బురద జల్లతున్నారని మండిపడ్డారు. మృతి చెందిన వ్యక్తి తన కుమారుడికి వీరాభిమాని అని చెప్పారు. దైవదర్శనం కోసం వెళ్లిన తన కుమారుడు శ్రీకాంత్‌ను కోయంబత్తూర్ వెళ్లాడని మాజీ మంత్రి విశ్వరూప్ తెలిపారు.

కాగా మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు పినిపె శ్రీకాంత్‌‌ను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. వార్డు వాలంటీర్ దుర్గాప్రసాద్‌ను హత్య చేయించారని శ్రీకాంత్‌‌పై ఆరోపణలు ఉన్నాయి. తన కుటుంబసభ్యులకు అసభ్యకర మెసేజ్‌లు పంపాడని శ్రీకాంత్‌ హత్య చేయించారని ఆయన అనుచరుడు ధర్మేశ్ రిమాండ్ రిపోర్టుతో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed