- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనలో జోష్: పవన్ సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి పవన్ కల్యాణ్ సాదరంగా స్వాగతం పలికారు. పడాల అరుణలాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరడం సంతోషకరమన్నారు. ఇటీవలే తనను పడాల అరుణ కలిశారని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను పడుతున్న తపనను, పోరాటం పట్ల ఆకర్షితురాలినైనట్లు వెల్లడించారు.
మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని జనసేన పార్టీలో చేరతానన్నారని...తాను స్వాగతించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేన పార్టీలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని తాను బలంగా నమ్ముతున్నట్లు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీలో చేరిన అనంతరం పడాల అరుణ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఏమీ బాగోలేదని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు. అందువల్లే తాను పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఆలోచన విధానాలు, యువత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం తనకు ఎంతో నచ్చాయి అని పడాల అరుణ స్పష్టం చేశారు.
ఇకపోతే పడాల అరుణ గజపతినగరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మూడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు.1989, 1994, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేకాదు చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆమె సైలెంట్ అయిపోయారు. అయితే గజపతి నగరం నియోజకవర్గంలో గానీ టీడీపీలో గానీ తనకు ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని భావించిన ఆమె రెండేళ్ల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె వైసీపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా ఆమె జనసేన పార్టీలో చేరారు.
Read More..