- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ బాధ్యత పవన్‌దే.. బీజేపీ నేత Kanna Laxminarayana కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని ఇందులో భాగంగా తొమ్మిదేళ్ల క్రితం పార్టీని స్థాపించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జనసేన పార్టీని బయట నుంచి ఎవ్వరూ ప్రభావితం చేయకుండా చూడాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. జనసేనను అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను పవన్ కల్యాణ్ నిర్ణయానికి వదిలేస్తే బెటర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 22 శాతం మంది కాపులు ఉన్నారన్నారు. కాపులు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అధికారంలోకి రావడం 1989 నుంచి జరుగుతుందని వెల్లడించారు. అందుకే అన్ని పార్టీలు కాపులను ఎన్నికల కోసం వాడుకుంటున్నాయని పేర్నొన్నారు. కాపులను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప కాపు రిజర్వేషన్ల డిమాండ్‌పై స్పందించే నాయకుడు కరువవుతున్నాడని ధ్వజమెత్తారు. చాలా మంది నాయకులు రిజర్వేషన్‌ల కోసం పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందని దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం దివంగత సీఎం వైఎస్ఆర్ దగ్గర నుంచి ఉందని, అయితే అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల సంక్షేమం కోసం పి.శివ శంకర్, మిరియాల వెంకట్రావులు చిత్తశుద్ధితో పని చేశారని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.