- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ సన్యాసంపై మాజీ మంత్రి అనిల్ యాదవ్ క్లారిటీ .. ‘నో ప్రాబ్లమ్’ అంటూ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో అనిల్ కుమార్ యాదవ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటున్నారని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ ఎట్టకేలకు రాజకీయ సన్యాసం ఛాలెంజ్‌పై స్పందించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని తాను సవాల్ చేసిన మాట వాస్తవమేనని, కానీ తన సవాల్‌ను ఎవరూ స్వీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. గెలిచినోడు చెబుతాడు.. ఓడినోడు వినాలని అన్నారు. ఎంత ట్రోల్ చేసిన నాకు ఇబ్బందేమి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో పబ్లిసిటీయే తప్ప నష్టమేమి లేదని అన్నారు.