షర్మిల తీరుతో వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండెలో బాధ: మాజీ మంత్రి అనిల్ యాదవ్

by Satheesh |   ( Updated:2024-01-21 15:56:08.0  )
షర్మిల తీరుతో వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండెలో బాధ: మాజీ మంత్రి అనిల్ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. సోదరుడు, సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే నియంతలే పాలకులు అవుతారని పరోక్షంగా సోదరుడు జగన్‌ను నియంతంతో పోల్చారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధేమి లేదని.. ఎక్కడ చూసిన ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియా అని విమర్శలు గుప్పించారు. దీంతో షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే షర్మిల కామెంట్స్‌పై ఆమె వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంగా.. వైపీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా షర్మిల వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ యాదవ్ రియాక్ట్ అయ్యారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రల్లో వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని ఘాటు ఆరోపణలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరకాలపు శత్రువు చంద్రబాబు కోసం ఆయన కూతురు షర్మిల పని చేయడం సబబేనా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌పై ఇవాళ చేసిన మాటలతో మిమ్మల్ని చర్రిత కూడా క్షమించదని షర్మిలను అన్నారు. మీరు చేస్తోన్న ఈ పొరపాటుతో ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతారని సూచించారు. షర్మిల తీరుతో వైఎస్సార్‌ను విమర్శించే ప్రతి గుండె బాధపడుతోందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed