విజయ డెయిరీలో సీఎం చంద్రబాబు ఫోటో ఉండాల్సిందే: భూమా అఖిల ప్రియ

by srinivas |   ( Updated:2024-10-16 13:58:11.0  )
విజయ డెయిరీలో సీఎం చంద్రబాబు ఫోటో ఉండాల్సిందే: భూమా అఖిల ప్రియ
X

దిశ, వెబ్ డెస్క్: విజయ డెయిరీ(Vijaya Dairy)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఫోటో ఉండాల్సిందేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ(MLA Bhuma Akhila Priya) అన్నారు. విజయ డెయిరీలో చంద్రబాుబ ఫొటో లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రోటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు ఫోటో ఉండాల్సిందేనని భూమా అఖిల ప్రియ తేల్చి చెప్పారు. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారందరి చిత్రపటాలు డెయిరీ చైర్మన్ ఛాంబర్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫోటో మాత్రం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. విజయ డెయిరీకి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకపోతే మాజీ సీఎం ఎన్టీ రామారావు(Former CM NT Rama Rao) శిలాఫలకం ఇక్కడ ఎందుకు ఉందని నిలదీశారు. ఇప్పటికైనా పాత పద్ధతులు మానుకోవాలని అఖిలప్రియ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed