50 రోజుల టీడీపీ పాలనపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

by Mahesh |   ( Updated:2024-07-23 15:03:55.0  )
50 రోజుల టీడీపీ పాలనపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో టీడీపీ ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. 50 రోజుల్లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. ఓటాన్‌ బడ్జెట్‌పై ఆధార పడాల్సి వస్తోందని విమర్శించారు. అలాగే సభలో వైసీపీ నాయకులను ప్రతిపక్షంగా గుర్తించడానికి టీడీపీ ప్రభుత్వం భయపడుతోందని..సీఎం చంద్రబాబు భయం భయంగా పరిపాలన చేస్తున్నారని..సభలో ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తామని చంద్రబాబు భయపడుతున్నారంటూ మాజీ సీఎం జగన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కాగా.. నల్ల కండువాలు వేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సభకు హాజరయ్యారు. అనంతరం కొద్దిసేపటికే సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story
null