- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
26 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ సంచలన నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు సభలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఏసీ సమావేశానికి హాజరుకాని వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు మంగళవారం, బుధవారం హాజరుకాకూడదని నిర్ణయించింది. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఢిల్లీలో నిరసించాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రెండు రోజులు ఢిల్లీలో తమ గళం వినిపించాలని నిర్ణయించారు. ఈ కారణంతోనే రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఢిల్లీలో చేపట్టే ధర్నాకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ఈ ధర్నాలో పాల్గొననున్నారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమయ్యారు.. మంగళవారం, బుధవారం మినహా మిగిలిన రోజుల్లో అసెంబ్లీకి వెళ్లాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు.
ఇక తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు సభ మధ్యలోనే వాకౌట్ చేశారు. సమావేశాలు ప్రారంభంతోనే సభలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని నినాదాలు చేశారు. తమ నేతలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. అటు బీఏసీ సమావేశానికి సైతం డుమ్మా కొట్టారు.
Read More..
AP Politics:‘అప్పటి నాటకాన్నే జగన్ మళ్లీ మొదలు పెట్టారు’ ..సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు