Ys Jagan: ఏపీలో శాంతి భద్రతలపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-07-20 15:10:05.0  )
Ys Jagan: ఏపీలో శాంతి భద్రతలపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటరీ పార్టీ నేతలతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ నెల 22నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో వైసీపీ ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఘటన పరాకాష్ట అని అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించారు.

టీడీపీ శ్రేణులు తప్పులు చేసి తిరిగి వైసీపీ నాయకులపైనే కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న చంద్రబాబు పార్టీ నాయకులు తమ శ్రేణులు, కార్యకర్తలపై దాడులు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఏపీ జరుగుతున్న దాడులు ప్రజా స్వామ్య మనుగడను దెబ్బ తీసేలా ఉన్నాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకూడదనే ప్రతిపక్షాలపై అధికార పార్టీ దాడుల చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఢిల్లీలో పోరాటం చేయబోతున్నామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Read More..

ఢిల్లీలో ధర్నా చేస్తానన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు సెటైర్

Advertisement

Next Story

Most Viewed