- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై జగన్ తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పార్టీ అధినేత జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు కప్పుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు యత్నించారు. అయితే వైసీపీ సభ్యులను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని సూచించారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని తమను ఎవరు ఆదేశించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అసెంబ్లీ గేటు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పోలీసులు ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. అత్యుత్సాహం ప్రదర్శించొద్దన్నారు. ప్లకార్డులు చించే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.