ఆ డబ్బంతా ఏమైంది?.. మాజీ సీఎం జగన్ ప్రశ్నల వర్షం

by srinivas |   ( Updated:2024-10-13 15:45:11.0  )
ఆ డబ్బంతా ఏమైంది?.. మాజీ సీఎం జగన్ ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంపై నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? అని, లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని నిలదీశారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవని, ఇప్పుడు అదికూడా లేదన్నారు. అసలు ఇసుక‌ కొందామంటేనే తమ ప్రభుత్వంలో కన్నా రేటు రెండింతలు ఉందని, ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పు వేసిన విషయాన్ని మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అని, అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను తమరు ఏర్పాటు చేయలేదా? అని, భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా?. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది?. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీలనేతలు దోచేయలేదా?. కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజంకాదా?.’’ అని జగన్ నిలదీశారు.

Advertisement

Next Story