- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టకాలంలో జగన్‌కు మరో బిగ్ షాక్.. కీలక నాయకురాలు గుడ్ బై
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఝాన్సీ రాణి రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో ఆమె డీసీసీబీ చైర్ పర్సన్‌గా పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. దీంతో ఝాన్సీ రాణి తనకు కేటాయించిన పదవుల నుంచి వైదొలిగారు. వైఎస్సార్ కడప డీసీసీబీ చైర్ పర్సన్‌పదవితో పాటు ఆప్కాబ్ చైర్మన్ బాధ్యతలకు సైతం మల్లెల ఝాన్సీరాణి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేసినట్లు వివరణ ఇచ్చారు.
కాగా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడంతో ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామాలు చేశారు. మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమయం కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ ఒంటెద్దు పోకడలకు పోవద్దని.. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతల అభిప్రాయాలు స్వీకరించాలని కోరుతున్నారు.