రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం.. జగన్‌పై మాజీ సీఎం ఫైర్

by Disha Web Desk 16 |
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం.. జగన్‌పై మాజీ సీఎం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అయితే రాయచోటిలోని ఓ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల ఐకాస నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సంచలన హామీ ఇచ్చారు. ప్రైవేటు విద్యా సంస్థలను సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ప్రైవేటు విద్యా సంస్థలనే కాదని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తను సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్ నిధులను సకాలంలో చెల్లించామని గుర్తు చేశారు. కానీ సీఎం జగన్ హయాంలో ఎప్పుడు జయ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో రాజంపేట పార్లమెంట్ స్థానంలో కుల సంఘాలు, పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థల యజమానులతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కడప జిల్లా రాయచోటిలో ప్రైవేటు విద్యా సంస్థల ఐకాస నేతలతో భేటీ అయ్యారు. తాను గెలిస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Read More...

క్రైస్తవులకు బ్రదర్ అనిల్ సంచలన పిలుపు



Next Story