వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్ ఇదే..!

by Javid Pasha |   ( Updated:2023-04-16 15:46:51.0  )
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డివైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ కేసు విచారణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం అందులోనూ డీఐజీ స్థాయి అధికారిని నియమించడంతో విచారణ మరింత దూకుడు పెరిగిందన్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత విచారణలో ఆయన ఇచ్చిన సమాచారంతోనే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ కేసులో 120బీ సెక్షన్ అనేది చాలా కీలకమని చెప్పుకొచ్చారు.

ఈ సెక్షన్ ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతీ ఒక్కరినీ విచారిస్తారని వెల్లడించారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత వెల్లడైన విషయాల ఆధారంగా ఈ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఎంతమంది ఉన్నది.. ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది అన్నది విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి హత్య ఇన్ని సంవత్సరాలు పట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి సీబీఐ నివేదికను సుప్రీం కోర్టుకు అందుజేస్తుందని తాను భావిస్తున్నట్లు జేడీ లక్ష్మినారాయణ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : Breaking: ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం

Advertisement

Next Story

Most Viewed