మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్.. ‘నాడు నేడు’ అవినీతిపై విచారణ

by srinivas |
మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్.. ‘నాడు నేడు’ అవినీతిపై విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి త్వరలో బిగ్ షాక్ తగలనుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో స్కూళ్ల అభివృద్ధికి ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ మేరకు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని స్వయంగా మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని, స్కూళ్ల అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల దోచుకున్నారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. అందువల్ల ‘నాడు నేడు’లో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని వెల్లడించారు.

వచ్చే సంవత్సరం నుంచి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యావిధానంలోనూ కొత్త పాలసీ తీసుకొస్తామని ఆయన చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు కాలేజీలను మ్యాపింగ్ చేస్తామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్కూల్స్ కాలేజ్ ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వం పాలిటెక్నికల్ కాలేజీలను నిర్వీర్యం చేసిందని, ఐటీఐ కాలేజీలతో పాటు Nacను బలోపేతం చేయాలన్నారు. అంతేకాదు కాలేజీలకు టెక్నాలజీని అనుసంధానం చేయాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed