- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap: నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా పెందుర్తి(Pendurthi)లో ఫుడ్ పాయిజన్(Food Poisoning) కలకలం రేగింది. స్థానిక నర్సింగ్ హాస్టల్(Nursing Hostel)లో విద్యార్థులు(Students) భోజనం చేసిన తర్వాత ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు వెంటనే విద్యార్థులకు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందని హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని హాస్టల్ సిబ్బంది అంటున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. అయితే మిగిలిన విద్యార్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.