హజ్ యాత్రకు విమాన సౌకర్యం : ఎంపీ విజయసాయి రెడ్డి

by Vinod kumar |
హజ్ యాత్రకు విమాన సౌకర్యం : ఎంపీ విజయసాయి రెడ్డి
X

దిశ. ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితంగా ఏపీ నుంచే నేరుగా హజ్ యాత్రకు వెళ్లే సౌకర్యం ఏర్పడిందని, తొలిసారి విజయవాడ నుంచి విమాన సదుపాయం కల్పించినట్లు రాజ్యసభ సభ్యులు, విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన గురువారం పలు అంశాలను వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం కల్పిస్తోందని అన్నారు. మక్కాలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన యాత్రికులకు ఒకే ప్రాంగణంలో వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story

Most Viewed