- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:వైసీపీకి షాక్..వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా?
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. వైఎస్ జగన్ పార్టీ నేతలతో ఓటమికి గల కారణాలపై సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ పట్ల విముఖత చూపెట్టిన పలువురు నేతలు పార్టీ సమావేశాలకు అటెండ్ అవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ భేటీలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఎంపీలను భేటీలకు పిలుస్తున్నారు. తాజాగా నిన్న(శనివారం) నిర్వహించిన పార్లమెంటరీ సమావేశానికి ఐదుగురు రాజ్యసభ సభ్యులు హాజరు కాలేదని సమాచారం. దీనిపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భేటీకి డుమ్మా కొట్టిన కొంతమంది ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది.