మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

by Mahesh |
మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నదికి ఎగువన ఉన్న రాష్ట్రాలతో పాటు, నది పరివాహక ప్రాంతంలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొద్ది రోజులగా ప్రశాంతంగా ఉన్న కృష్ణా నది మరోసారి సముద్రం వైపు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రజేక్టులకు భారీ వరద వస్తుండటంతో అన్ని డ్యామ్ ల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బెజవాడలోని కృష్ణ బ్యారేజ్‌కు వరద భారీగా వచ్చి చేరుతుంది. విజయవాడ వద్ద మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు తెరుచుకున్న అన్ని గేట్లు పైకి ఎత్తి పెట్టి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి 4,44,842 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 4,44,842 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ను దిగువకు వదులుతున్నారు. కాగా ఈ వరద ప్రవాహం మరికొన్నింటిలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు.

Advertisement

Next Story