FIR Filed: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్.. భార్య జయసుధపై కేసు నమోదు

by Shiva |
FIR Filed: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్.. భార్య జయసుధపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)కి ఊహించని షాక్ తగలింది. రేషన్ బియ్యం (Ration Rice) అక్రమాలపై సవిల్ సప్లైయ్ అధికారి కోటిరెడ్డి (Koti Reddy) ఫిర్యాదు మేరకు తాజాగా పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వం హయాంలో నాని తన భార్య జయసుధ పేరిట గోడౌన్ నిర్మించిన పేర్ని నాని సివిల్ సప్లై శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే, తాజాగా రేషన్ బియ్యం స్టాక్‌లో అవకతవకలను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయం అయినట్లుగా తేలింది. అయితే, పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story