Raghava Lawrence:శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న సినీ హీరో

by Jakkula Mamatha |   ( Updated:2024-09-13 15:20:16.0  )
Raghava Lawrence:శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న సినీ హీరో
X

దిశ, మంత్రాలయం:శ్రీ రాఘవేంద్ర స్వామిని తన ఇష్ట దైవంగా కొలిచే భక్తులలో ముందు స్థానంలో సినీ హీరో, నిర్మాత, యాక్టర్, డాన్స్ మాస్టర్‌గా మంచి గుర్తింపు పొందిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాఘవ లారెన్స్ ముందుంటారు. ఆయన ప్రతి ఏటా కూడా శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి తుంగభద్ర నది తీరాన వెలిసిన ఆయన బృందావనంను సందర్శించడానికి వస్తూ ఉంటారు. అదే క్రమంలో గురువారం స్వామివారి రోజుగా భావిస్తారు. కావున రాఘవ లారెన్స్ కూడా గురువారం రోజు పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానాన్ని పొందిన మంత్రాలయం శ్రీ మఠాన్ని వారు దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర తుంగభద్ర నదిలో స్నానమాచరించి గ్రామ దేవత మంచాలమ్మ సన్నిధానం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. రాఘవ లారెన్స్ రాకతో స్థానికంగా ఉండే ఆయన అభిమానులు వారితో సెల్ఫీ కోసం పోటీపడ్డారు.

Advertisement

Next Story