మంత్రి అంబటిపై మరోసారి నటుడు పృథ్వీ సెటర్స్

by srinivas |   ( Updated:2024-03-27 15:24:14.0  )
మంత్రి అంబటిపై మరోసారి నటుడు పృథ్వీ సెటర్స్
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: అనకాపల్లి సర్వ కామదాంబా పార్క్ సెంటర్లో సినీ నటుడు పృథ్వీ గాజు గ్లాస్‌తో జనసేన ప్రచారం బుధవారం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులు గాజు గ్లాసుకు ఓటు వేసి అనకాపల్లిలో కొనతల రామకృష్ణను గెలిపించాలని కోరారు. గాజు గ్లాసు పగిలే కొద్దీ పద్ధతి ఎక్కుతాది లఫూట్ అంటూ అంబటి రాంబాబు‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

"ఈ మధ్య జాతర్లలో బాగా డాన్స్ చేస్తున్నావు. నాకన్నా బాగా డాన్స్ చేస్తున్నావు. మా ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు అడిగితే షోలు పెడతాం. ఒక లక్ష రూపాయలు ఇప్పిస్తాం. వచ్చి డాన్స్ వేస్తా ఉండు." అని అన్నారు. "మంత్రులుగా ఉండి ప్రాజెక్టుల కోసం సమీక్షలు, సమావేశాలు లేకుండా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజా అయితే ఏపీలో టూరిజం ఎక్కడికో పోయిద్ది అంటున్నారు. అంటే ఎక్కడ పోయిందో తెలియదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చి అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్నారు." అని విమర్శించారు

"కోటి గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను భూముల దోపిడీకే నియమించుకున్నారు. గుడివాడ అమర్ గాజువాక‌లో కూడా గెలిసే ప్రసక్తే లేదు. ముద్రగడ పద్మనాభంకు డబ్బు , పదవి , అధికార దాహం, తలకెక్కి మాట్లాడుతున్నారు. కిర్లంపూడి నుండి ర్యాలీగా వెళ్లి వైసీపీలో చేరుదానునుకున్నారు. తూర్పు , పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు చెప్పులు గుడ్లతో దాడి చేస్తారన్న ఇంటిలిజెన్స్ సమాచారంతోనే విరమించుకున్నారు. పిఠాపురం ప్రజలకు వైసీపీ భారీ ఎత్తున ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నా అక్కడ ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం, హరి రామజోగయ్య కాపులను కులం పేరు చెప్పి వాడుకున్నారు. అసలు కుల పిచ్చి మొదలెట్టిందే ముద్రగడ పద్మనాభం , హరిదామ జోగయ్య. మిథున్ రెడ్డిని తీసుకువచ్చి ఇన్చార్జి నియమించడం సిగ్గుచేటు. పిఠాపురంలో ఎవరు ఎన్ని కుట్రలు పండిన పవన్ విజయాన్ని ఆపలేరు." అని నటుడు పృథ్వీ అన్నారు

Read More..

AP Political News: నాకు అసలు ఆ ఆలోచనే లేదు.. మాగంటి సంచలన వ్యాఖ్యలు..

Advertisement

Next Story