సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రైతు, కూలీ, డ్రైవర్

by GSrikanth |   ( Updated:2024-03-18 07:09:42.0  )
సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రైతు, కూలీ, డ్రైవర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార వైసీపీ నేతలు దూకుడు పెంచారు. రెండ్రోజుల క్రితం ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ఇడుపులపాయ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ సారి అభ్యర్థులను ఎంపిక చేశారు. అనూహ్యంగా చాలా మంది సిట్టింగులను మార్చారు. జాబితాలో ఈ సారి బహజనులకు అధిక సీట్లు కేటాయించినట్లు చెప్పుకుంటున్నారు. రెండొందల అసెంబ్లీ, లోక్‌సభ సీట్లలో ఏకంగా 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించామని మంత్రి ధర్మాన ప్రకటించారు.

ఈ జాబితాలో కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. టిప్పర్ డ్రైవర్‌, రోజు కూలీకి, రైతుకు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. శింగనమల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు బరిలోకి దిగారు. అలాగే మడకశిర అభ్యర్థిగా ఉపాధి కూలీ అయిన ఈర లక్కప్ప, మైలవరం అభ్యర్థిగా సామాన్య రైతు తిరుపతిరావును జగన్ బరిలో పెట్టారు. దీంతో జగన్ వ్యూహాత్మకంగానే వారికి సీట్లు కేటాయించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More..

టీడీపీకి బిగ్ షాక్.. కేంద్ర పెద్దలకు ఏపీ బీజేపీ నేతల కీలక లేఖ

Advertisement

Next Story