AP లో ఈసారి ఆ పార్టీదే గెలుపు.. పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటో చెప్పేసిన ప్రముఖ ఆస్ట్రాలజర్

by sudharani |
AP లో ఈసారి ఆ పార్టీదే గెలుపు.. పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటో చెప్పేసిన ప్రముఖ ఆస్ట్రాలజర్
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్ని రాష్ట్రాల దృష్ణిని ఆకర్షిస్తున్నాయి. 2014 మాదిరిగానే మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా.. అధికార వైసీపీ సింగిల్‌గా పోటీ చేసింది. ఇరుపార్టీల హోరాహోరీ ప్రచారాలతో రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి. ఇక ఓటింగ్ కూడా ముగిసి.. మరో రెండు రోజుల్లో రిజల్ట్ రానున్నాయి. దీంతో కౌంటింగ్ రోజు కోసం రాజకీయ నేతలు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా.. ఈసారి జనసేన పార్టీకి ప్రజల మద్దతు కూడా గట్టిగా ఉంటడంతో.. పవన్ కల్యాణ్ గెలుపు దాదాపు ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాలపై ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆచార్య రాఘవేంద్ర చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

ఆయన మాట్లాడుతూ.. ‘గడిచినటువంటి 15 సంవత్సరాల నుంచి రాజకీయ ఫలితాలను తెలిపిన ఒక జోతిష్య పండితుడిగా చెబుతున్నాను.. ఈసారి 2024 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. జగన్ పార్టీలో చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో.. వారిలో 25 మంది మంత్రులు ఓడిపోబోతున్నారు. అసలు వాళ్లు ఓడిపోతారని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పటి వరకు ఎన్నో మంచి పనులు చేసి.. పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారే ఓడిపోబోతున్నారు’ అని చెబుతూ.. నలుగురు మంత్రుల పేర్లు రివీల్ చేశారు. అలాగే.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత సీఎం ఎవరు..? జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటీ..? అని అనేక విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా. అయితే.. ‘దిశ’ టీవీకి రాజకీయ జ్యోతిష్య పండితులు ఆచార్య రాఘవేంద్ర ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.


Advertisement

Next Story

Most Viewed