- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ నాయకులు గొంతు చించుకుంటున్నారు నమ్మొద్దు: Poonam Kaur సంచలన ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ రాజకీయ వ్యవహారాలపై, కొన్ని సంఘటనలపై పలు వివాదాస్పద పోస్టులతో దుమారం రేపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా, పూనమ్ ఏపీ రాజకీయాలపై ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ‘‘ ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వాళ్లను నమ్మొద్దు. మహిళలకు ఏదో జరిగిపోతుందని వారికి అంతగా ఆందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్క మాటైనా వీరు మాట్లాడలేకపోయారు. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి’’ అంటూ పూనమ్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్టును చూసిన వారు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పెట్టిందని ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించ లేవంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Jana Sena Chief Pawan Kalyan : తిరుపతికి పవన్ కల్యాణ్..తరలివచ్చిన జనసైనికులు
రేపటితో ముగియనున్న ఆషాఢం..స్టేట్‌లో మరింత పెరగనున్న పొలిటికల్ హీట్
The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023