- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూ హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి కాకాణీ దోపిడీ.. మాజీ మంత్రి సోమిరెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో వైసీపీ దారుణాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోందని, శాశ్వత భూ హక్కు చట్టాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను దోచేశారని ఆయన ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలను ఆయన వెల్లడించారు. భూములను బినామీలకు మంత్రి రాసిచ్చేశారని, సర్వేపల్లి నియోజకవర్గంలో 5,445 ఎకరాలు పంపిణీ చేశామని మంత్రి కాకాణి చెబుతుండగా, జాయింట్ కలెక్టర్ మాత్రం 3,300 ఎకరాలేనని చెప్పడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. మిగిలిన భూమి ఏమైంది, వాస్తవాలు తెలిసేలా లబ్ధిదారుల పేర్లతో కూడిన భూ పంపిణీ జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. గ్రామసభలు నిర్వహించకుండానే భూములు పంపిణీ చేస్తారా, మంత్రి చేసిన అక్రమాలకు జిల్లా అధికారులు అండదండలు అందించారని ఆరోపించారు. కేవలం పది రోజుల్లో జాబితాను బహిర్గతం చేయకపోతే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు.