AP:విస్తరించిన రుతుపవనాలు..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

by Jakkula Mamatha |
AP:విస్తరించిన రుతుపవనాలు..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్‌లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్‌లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి. కాగా ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య ద్రోణి సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల బుధవారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed