AP Politics:ఎమ్మెల్సీ ఎన్నికలు..కూటమి అభ్యర్థి పై వీడనున్న ఉత్కంఠ!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-12 09:17:38.0  )
AP Politics:ఎమ్మెల్సీ ఎన్నికలు..కూటమి అభ్యర్థి పై వీడనున్న ఉత్కంఠ!
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుని ఖరారు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థి పై ఇంకా సస్పెన్స్ నెలకొంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముస్తున్నప్పటికీ కూటమి అభ్యర్థిని ఖరారు చేయకపోవడం పై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) కూటమి అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. కాగా కూటమి తరపున తెరపైకి బైరా దిలీప్ చక్రవర్తి పేరు వచ్చింది. మరోవైపు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఇవాళ అభ్యర్థి పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించే సూచనలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed