మాజీమంత్రి పరిటాల సునీత ఆమరణ నిరాహార దీక్ష

by Seetharam |
Paritala-Sunitha-1
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలతో కలిసి ఆమె దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇకపై శాంతి యుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో నిందితులను రెడ్డిపల్లి జిల్లా జైల్లోనే హత్య చేశారని పరిటాల సునీత గుర్తుచేశారు. ఇకపోతే పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జనసేన రాష్ట్ర నేత భవాని రవికుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఐ నేత మల్లికార్జున సంఘీభావం తెలిపారు.

Advertisement

Next Story