Ap News: పది పరీక్షలకు సర్వం సిద్ధం.. అవి తీసుకొస్తే నో అనుమతి

by srinivas |   ( Updated:2023-04-02 15:20:17.0  )
Ap News: పది పరీక్షలకు సర్వం సిద్ధం.. అవి తీసుకొస్తే నో అనుమతి
X

దిశ ఏపీ బ్యూరో: సోమవారం నుంచి రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45వరకు పరీక్ష జరగనుంది. 6 రోజుల్లో 6 పరీక్షలు ఉండనున్నాయి. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్, తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించబోరు. రాష్ట్రంలో మొత్తంగా 6,09,070 మంది పరీక్ష రాయనున్నారు. 3,349 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

43వేల మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేషన్ విధుల్లో పాల్గొననున్నారు. అంధ విద్యార్థులకు డిజిటల్ విధానంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో 6,09,070 మంది బాలురు, 3, 11,329 మంది బాలికలు ఉన్నారు 2,97,741 మంది పది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నవారు: 53,410 మంది ఓపెన్ స్కూల్ నుంచి హాజరుకానున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు స్క్వాడ్లు 838, ఇందులో సిట్టింగ్ స్క్వాడ్లు 682, ఫ్లయింగ్ స్క్వాడ్లు 156 మంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed