తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: జనసేన పార్టీ మేనిఫెస్టో

by Seetharam |
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: జనసేన పార్టీ మేనిఫెస్టో
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన మేనిఫెస్టోపై కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు, మేధావి వర్గాల సూచనలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పీపుల్స్ మేనిఫెస్టో రూపొందుతోందని వెల్లడించారు. చేగొండి హరిరామ జోగయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు. అంశాల వారీగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని అన్నారు. అనంతరం చర్చించి జనసేన, తెలుగుదేశం ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చుతామని చెప్పుకొచ్చారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం, ఉపాధి అవకాశం కల్పించాలనేది తమ మొదటి లక్ష్యమని ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కోస్తా కారిడార్ విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. బీసీలకు కనీసం 30శాతం విద్య, ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కాపుల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలనేది మరో ప్రతిపాదనగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 18 మంది సభ్యులతో మేనిఫెస్టో ఖరారు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరులోగా ప్రజాభిప్రాయాలను 98486 34249, 70369 24692 అనే ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed