- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కిల్ స్కామ్ కేసు: సీఐడీ కస్టడీ పిటిషన్‌పై సాయంత్రం తీర్పు
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. అయితే సాయంత్రం 4 గంటలకు తీర్పు వెల్లడిస్తామని జయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఇకపోతే సీఐడీ కస్టడీ పిటిషన్లపై బుధవారం సుమారు మూడు గంటలకు పైగా వాడీ వేడి వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటు చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. గురువారం ఉదయం 11:30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా తీర్పును మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా వేసింది.
కస్టడీకిస్తే కుట్రకోణం బయటపడుతుంది : పొన్నవోలు
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కస్టడీ పిటిషన్‌పై బుధవారం ఉదయం విచారణ జరగ్గా న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నాం సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో న్యాయం అనేది జరిగి తీరాలి అని సూచించారు. ఈ కేసులో చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు అని వాదించారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు అని వాదించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం అని కోర్టులో వాదించారు. చంద్రబాబు నాయుడుని పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అని స్పష్టం చేశారు. చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉందని.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది అని అన్నారు. చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు
మళ్లీ సీఐడీ కస్టడీకి ఎందుకు : సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. స్కిల్ డవలప్‌మెంట్‌లో స్కామ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతి చేసినటల్లు ఆధారాలు లేవు అని చెప్పుకొచ్చారు. అరెస్టు ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అని వాదించారు. యన్.యస్.జి భద్రత ఉన్న వ్యక్తి ని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు అని లూథ్రా వాదించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు..ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు అని వాదనలు వినిపించారు. నాలుగేళ్లుగా ఎవరిని అరెస్టు చేసినా నిధులు దుర్వినియోగం పేరే చెబుతున్నారు..చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగింది అని సిద్ధార్థ లూథ్రా వాదించారు. విచారణలో కొత్త కోణం కోర్టు ముందు పెట్టలేక పోయారు..ఆధారాలు లేకుండా కస్టడీ ఎందుకు అడుగుతారు. చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబరు 11న కస్టడీకి కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారు. కొన్ని గంటలపాటు చంద్రబాబును విచారించారు. ఆయన్నుంచి అన్ని విషయాలు రాబట్టామని చెప్పి, మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారు. దర్యాప్తు విషయాలపై సీఐడీ మీడియా సమావేశాలు ఎలా పెడుతుంది అని సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు.
Read More..
బావ కళ్లల్లో ఆనంద కోసమే మీసం తిప్పారు : బాలకృష్ణపై మంత్రి రోజా