Eluru: ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు

by Ramesh Goud |
Eluru: ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో(AP Politics) కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ మంత్రి ఆళ్ల నాని(Alla Nani) టీడీపీ(TDP)లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవాళ అమరావతి(Amaravathi)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆళ్ల నాని చేరికను ఏటూరు టీడీపీ నేతలు(Eluru TDP Leaders) వ్యతిరేకిస్తున్నారు. ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వస్తున్న వార్తల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆళ్ల నాని చేరిక పై ఏలూరు నియోజకవర్గ టీడీపీ నేత వీడియో విడుదల చేశారు. ఇందులో ఆళ్ల నాని టీడీపీని అణగదొక్కేందుకు చేయని ప్రయత్నాలు లేవని, ఇప్పుడు ఎలా పార్టీలోకి వస్తారని మండిపడుతున్నారు. అలాగే చంద్రబాబును, లోకేష్(Minister Nara Lokesh) ను ఆయన కుటుంబాన్ని సోషల్ మీడియాలో దారుణంగా అల్లరి చేశారని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ప్రేరిపించి వారిని కించపరిచేలా పోస్టులు పెట్టించారని, దీనికి సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు దేనికి టీడీపీలోకి వస్తున్నారని, ఆళ్ల నాని పార్టీలోకి వస్తే. టీడీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పి రావాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు.

Next Story