- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Ellapragada Subbarao : ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు
దిశ, వెబ్ డెస్క్ : ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Eluru Govt Medical College)కి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు(Ellapragada Subbarao) పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచానికి పలు ముఖ్య ఔషధాలను అందించిన శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు స్వస్థలం భీమవరం. ఆయన చదువంతా రాజమండ్రిలో సాగింది. ఏలూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Nayudu)కు సూచించారు. బోదకాలు, క్షయ వంటి వ్యాధుల కట్టడికి సుబ్బారావు మెడిసిన్ రూపొందించారు. తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ 'అరియోమైసిన్'(Aureiomycin) కనుక్కున్నది కూడా ఆయనే. అలాగే కాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి వాడే డ్రగ్ ను అభివృద్ధి చేసింది కూడా సుబ్బారావు గారే. కాగా తన సూచనపై సానుకూలంగా స్పందించినందుకు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.