CM జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకో తెలుసా?

by GSrikanth |   ( Updated:2024-04-07 15:18:39.0  )
CM జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ ఆదివారం నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్‌కు జారీ చేసిన నోటీసుల్లో సీఈవో మీనా పేర్కొన్నారు. కాగా, ఈ నెల 3వ తేదీన పూతలపట్టు సిద్ధం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే, పూతలపట్టు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. నేరాలు చేయడం చంద్రబాబుకు అలవాటే అని వ్యాఖ్యానించారు. అంతుకుముందు మదనపల్లి సభలో చంద్రబాబును అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమాలోని విలన్(పశుపతి)తో పోల్చుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి కంప్లైంట్ చేశారు.

Read More..

56 నెలల మంచిని అడ్డుకున్నారు.. చంద్రబాబుపై సీఎం జగన్ ధ్వజం

Advertisement

Next Story

Most Viewed